Tuesday, 3 December 2013

ఆవాలు

Brassica spp . పోవు దినుసు గా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం , కాల్సియం , మాగనీస్ , జింక్ , ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు , పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి. * ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా టోకోఫెనాల్‌ అనే పదార్థం (విటమిన్‌ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. * ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి. * గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం, గౌట్‌ నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది. అరబకెట్‌ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. * తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది.

పోషకాలు (వందగ్రాములలో),

  • తేమ- 6.5గ్రా,
  • పొటాషియం- 20.3గ్రా,
  • కొవ్వు- 39.7గ్రా,
  • ఖనిజాలు- 2.4గ్రా,
  • పీచు- 4.8గ్రా,
  • పిండిపదార్థాలు- 23.8గ్రా,
  • శక్తి- 541కిలో కెలొరీలు,
  • క్యాల్షియం- 490మిగ్రా,
  • ఫాస్పరస్‌- 700మిగ్రా,
  • ఇనుము- 7.9.
  • టోకోఫెనాల్‌-9-82గ్రా

ఆవ నూనె

ఆవాల గింజల నుంచి మూడు రకాలుగా తయారయిన నూనె లకి ఆవాల నూనె లేదా ఆవ నూనె (ఆంగ్లం: Mustard oil) అనే పదాన్ని ఉపయోగిస్తారు:
  1. విత్తనాలను దంచడం ద్వారా వచ్చే క్రొవ్వుతో కూడిన స్థావర నూనె (ఉద్భిజ్జ తైలం),
  2. విత్తనాలను రుబ్బి, నీటితో కలిపి, స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెని గ్రహించడం వంటి పద్ధతుల ద్వారా లభించే సుగంధ తైలం.
  3. ఆవాల గింజల లభ్యాన్ని సోయాబీన్ నూనె వంటి వేరే స్థావర నూనెతో కలపడం ద్వారా చేసే నూనె.

ఆవ గింజలు

mustard seed, yellow
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 470 kcal   1960 kJ
పిండిపదార్థాలు     34.94 g
- చక్కెరలు  6.89 g
- పీచుపదార్థాలు  14.7 g  
కొవ్వు పదార్థాలు 28.76 g
- సంతృప్త  1.46 g
- ఏకసంతృప్త  19.83 g  
- బహుసంతృప్త  5.39 g  
మాంసకృత్తులు 24.94 g
నీరు 6.86 g
విటమిన్ A  3 μg 0%
థయామిన్ (విట. బి1)  0.543 mg   42%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.381 mg   25%
నియాసిన్ (విట. బి3)  7.890 mg   53%
విటమిన్ బి6  0.43 mg 33%
ఫోలేట్ (Vit. B9)  76 μg  19%
విటమిన్ బి12  0 μg   0%
విటమిన్ సి  3 mg 5%
విటమిన్ ఇ  2.89 mg 19%
విటమిన్ కె  5.4 μg 5%
కాల్షియమ్  521 mg 52%
ఇనుము  9.98 mg 80%
మెగ్నీషియమ్  298 mg 81% 
భాస్వరం  841 mg 120%
పొటాషియం  682 mg   15%
సోడియం  5 mg 0%
జింకు  5.7 mg 57%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు
ఆవ గింజలు (Mustard seeds) ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి: నల్లని ఆవాలు (Brassica nigra) నుండి, బ్రౌన్ ఆవాలు (Indian mustard) (Brassica juncea) నుండి మరియు తెల్లని ఆవాలు (Brassica. hirta/Sinapis alba) నుండి తీస్తారు.* ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. * మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి. దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం విరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది. విరుగుడు మజ్జిగ, పెరుగు.

వైద్య పరం గా ఉపయోగాలు :

  1. పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది .
  2. ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది ..
  3. పేలు తగ్గదాని కు తగ్గదనికు ఆవాల పొడి నునే రాసుకోవాలి .
  4. మాడు మీద కురుపులు ,దురదలను అవ్వలు తగ్గిస్తయాయి .
  5. ఉబ్బసం వ్యాది ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చెక్కెరతో కలిపి తీసుకోవాలి.
  6. ఆవాల పొడిని తేనే తో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిస్కరించవచ్చును .
  7. మందం గా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్దా రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
  8. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .. ఆవాల ముద్దా , కర్పూరము కలిపి బాధించే ప్రాంతమము మీద రాయటం వల్ల భాధ తగ్గుతుంది .
  9. ఆవాలులో సెలీనియం అనే రసాయనం వలన మనకు యాంటీ ఇంఫ్లమేటరీ ప్రయోజనాలు కలవు. ఆవాలలోని మెగ్నీషియం అస్థమా మరియు కీళ్ళ వాతం మరియు రక్త పోటును తగ్గించును.
  10. ఇవి పార్శవ నొప్పిని తగ్గిస్తాయి.

వాడకూడని పరిస్తితులు :

  • జీర్ణ కోశ అల్సర్లు , కిడ్నీ జబ్బులు ఉన్నా వారు
  • దీని వేపర్స్ (పొగలు)కంటికి తగిలితే కన్ను ఇర్రిటేట్ అగును .
  • ఆరు సం. లోపు పిల్లలకు ఇవ్వకూడదు

No comments:

Post a Comment