Sunday, 24 November 2013
Sunday, 17 November 2013
అశ్వగంధ Ashwagandha
అశ్వగంధ
వితానిన్ (withanine), సోమఫెరిన్ (somniferine), సోమ్నిన్ (somnine), సోమ్ని ఫెరేనిన్ (somniferinie), వితనానిన్ (withananine), సూడో వితనిన్ (pseudoWithanine), త్రోపిన్ (Tropine), సూడో త్రోపిన్ (pseudoTropine),
స్తీరోయిడాల్ లాక్టన్ (Steroidal Lactones) :
వితనోలిదీస్ (withanolides),
ఇవి కాకుండా రెండు ఎకిల్ స్తేరిల్ గ్లుకోసైడ్స్ (Acyl Steryl Glucosides), ఉన్నాయి . పై రసాయనాలు అన్నీ నరాల ను ఉత్ప్రేరణ చేయడం , నరాలు వినాచనం కాకుండా కాపాడుతాయి . అశ్వగంధ తో ఏ మందు తీసుకున్న దాని పనితనము మెరుగు పరుస్తుంది (It enhanses the property of co-existing molecule) , వైద్యపరంగా :
- కాన్సర్ జబ్బులు రాకుండా కాపుడు తుంది .
- నరాల నీరసాన్ని తగ్గిస్తుంది ,
- రక్తపోటు , మదుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుని .
చేడుప్రభావము :
- ఎక్కువ మోతాదులో ఏమ్మువ రోజులు వాడితే గుండెపైన , అడ్రినల్ గ్రాందుల పైన చేడుప్రభావము చూపుతుంది.
- తిరాయిడ్ గ్రంధి ని ఉత్తేజ పరిచి "Hyperthyroid" జాబ్బుకి దారితీయవచ్చు .
అశోకవృక్షం ashoka
అశోకవృక్షం (Ashoka tree లేదా "sorrow-less") (S. asoca (Roxb.) Wilde ,
or Saraca indica L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే
చెట్టు. ఇది భారతదేశం
మరియు శ్రీలంక
దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.
అశోకం ఫాబేసి
(Fabaceae) కుటుంబంలోని సరాకా (Saraca)
ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా ఆకులతో నిండివుంటుంది. వీని పుష్పాలు
మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి
ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర
తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో
పుష్పిస్తాయి.
పురాణాలలో
- గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం క్రింద జన్మించాడు.
- మహావీరుడు వైశాలి నగరంలో అశోకవృక్షం క్రింద సన్యాసాన్ని స్వీకరించాడు.
- హిందువుల ప్రేమ దేవుడైన మన్మథుని పంచబాణాలు లో ఒకటి అశోకవృక్షం పుష్పాలు.
- రామాయణంలో అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు కనుగొంటాడు.
అత్తిపత్తి Athi Pathi
అత్తిపత్తి
విషయ సూచిక
లక్షణాలుకంటకాలు వంటి నిర్మాణాలతో సాగిలబడి పెరిగే చిన్నపొద.
- ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- సమపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న కెంపురంగు పుష్పాలు.
- నొక్కులు కలిగి తప్పడగా ఉన్న కాయలు.
అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?
అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని వుంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్మర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు (మొక్క కొమ్మలోపలికి) వెళ్లి పోతుంది. దాంతో ఆకులు ముడుచుకు పోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకొంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల జంతువులు తినకుండా వెళ్లిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్ళు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి.[
ఔషథ గుణాలు
- రక్త శుద్ది చేస్తుంది.
- ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
- స్త్రీరోగాలను హరించి వేస్తుంది.ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది,
- ఇది వాతాన్ని హరిస్తుంది.
- పాత వ్రణాలనుమాన్పుతుంది.
- మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
Adda Rasam అడ్డసరం
అడ్డసరం
అడ్డసరం (Adhatoda vasica or Justicia adhatoda) ఒక విధమైన ఔషధ
మొక్క.
దీని పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం అడహతోడ వాసికా నీస్. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. .
ఉపయోగాలు
- దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.
- దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయుక్తమయినవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
- అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.
- ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
- అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.
- గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు, చర్మదోషములందు అడ్డసరము (వైద్యమాత) కషాయము ను త్రాగించిన తగ్గుతాయి.
- నరముల రోగహరములు, పట్లు, నొప్పులు హరించును . నీళ్ళవిరేచనములు కట్టును . నేత్రరోగహరము గా పనిచేయును .
- అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.
adavi nabhi అడవినాభి
అడవినాభి
మొక్క వర్ణన
ఉద్యానవనాలలో పెంచదగిన వార్షికపు మొక్క. ఇది ప్రక్కన ఉండే చెట్లను, మొక్కలను అధారంగా ప్రాకుతుంది. ఆకులు కాండానికి ఎదురుబదురుగా ఉంటాయి. ఆకు మొదలు భాగం అర్థ హృదయాకారంలో ఉండి బారుగా ఉంటుంది. ఆకుల చివరి కొసలు తీగలాగా ఉండి ప్రక్క మొక్కలను పట్టుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్క పువ్వులు అనేక రంగులతో ప్రత్యేకతతో కూడిన ఆకర్షణ కలిగి ఉంటాయి. ఈ పూవులు చెట్టు పైన కనీసం ఏడు రోజుల పాటూ ఉంటాయి. ఈ పూవులు పెద్దవిగా ఉండి వాటి ఆకర్షణ పత్రాలు సన్నగా పొడవుగా అగ్ని కీలలు వలె వంకెలు తిరిగి ఉంటాయి. వాటి పుప్పొడి కీలాగ్రాలు 13 సెంటీమీటర్ల బారుగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు పువ్వు తొడిమ వద్ద ఆకు పచ్చ రంగులో ఉండి, క్రమంగా పసుపుపచ్చ, కాషాయ రంగు, కొసలు పూర్తి ఎరుపు రంగులో ఉంటాయి. దీని వేర్లు 15 నుండి 30 సెంటి మీటర్ల బారున కారెట్ దుంపల వలె ఉండి కొసలు సన్నగా మొనదేలి ఉంటాయి. ఈ మొక్క కాండము 3 నుండి 6 మీటర్లు బారున గట్టి తీగలుగా పెరుగుతుంది.
ఉపయోగపడే భాగాలు
వేరు భాగాలు.ఉపయోగాలు
ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది. భేది మందుగానూ, పురిటి నెప్పులను అధికం చేసేందుకు, లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టు, శరీరపు మంటలు, పైల్స్, పొత్తి కడుపు నొప్పి, దురదలను తగ్గిస్తుంది. శరీరానికి బలవర్థకము, వీర్యవృద్ధికి దివ్యౌషధము. మలాశయములోని జిగురును హరింపజేస్తుంది. నరాల నొప్పులకు, చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది. అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము.లక్షణాలు
ఇది 3.5 నుండి 6 మీటర్లు పొడవుదాకా బలహీనంగా ప్రాకే మొక్క.
- ఆకుల చివర్లలో మెలి తిరిగి ప్రాకడానికి అనువుగా ఆధారాన్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
- పుష్పాలు ఎరుపుతో కూడిన నారింజ రంగు మరియు పసుపుతో కూడిన తెలుగు రంగులో ఉంటాయి.
- కాయలు సుమారు 7-8 సెం.మీ. పొడవును కలిగి 40-50 విత్తనాలను కలిగివుంటాయి. విత్తనాలు ఎరుపుతో కూడిన నారింజ రంగులో ఉంటాయి.
ఉపయోగాలు
ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.- దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.
- దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.
Subscribe to:
Posts (Atom)