అత్తిపత్తి
విషయ సూచిక
లక్షణాలుకంటకాలు వంటి నిర్మాణాలతో సాగిలబడి పెరిగే చిన్నపొద.
- ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- సమపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న కెంపురంగు పుష్పాలు.
- నొక్కులు కలిగి తప్పడగా ఉన్న కాయలు.
అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?
అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని వుంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్మర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు (మొక్క కొమ్మలోపలికి) వెళ్లి పోతుంది. దాంతో ఆకులు ముడుచుకు పోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకొంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల జంతువులు తినకుండా వెళ్లిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్ళు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి.[
ఔషథ గుణాలు
- రక్త శుద్ది చేస్తుంది.
- ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
- స్త్రీరోగాలను హరించి వేస్తుంది.ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది,
- ఇది వాతాన్ని హరిస్తుంది.
- పాత వ్రణాలనుమాన్పుతుంది.
- మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
No comments:
Post a Comment