అశోకవృక్షం (Ashoka tree లేదా "sorrow-less") (S. asoca (Roxb.) Wilde ,
or Saraca indica L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే
చెట్టు. ఇది భారతదేశం
మరియు శ్రీలంక
దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.
అశోకం ఫాబేసి
(Fabaceae) కుటుంబంలోని సరాకా (Saraca)
ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా ఆకులతో నిండివుంటుంది. వీని పుష్పాలు
మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి
ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర
తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో
పుష్పిస్తాయి.
పురాణాలలో
- గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం క్రింద జన్మించాడు.
- మహావీరుడు వైశాలి నగరంలో అశోకవృక్షం క్రింద సన్యాసాన్ని స్వీకరించాడు.
- హిందువుల ప్రేమ దేవుడైన మన్మథుని పంచబాణాలు లో ఒకటి అశోకవృక్షం పుష్పాలు.
- రామాయణంలో అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు కనుగొంటాడు.
No comments:
Post a Comment