అడవినాభి
మొక్క వర్ణన
ఉద్యానవనాలలో పెంచదగిన వార్షికపు మొక్క. ఇది ప్రక్కన ఉండే చెట్లను, మొక్కలను అధారంగా ప్రాకుతుంది. ఆకులు కాండానికి ఎదురుబదురుగా ఉంటాయి. ఆకు మొదలు భాగం అర్థ హృదయాకారంలో ఉండి బారుగా ఉంటుంది. ఆకుల చివరి కొసలు తీగలాగా ఉండి ప్రక్క మొక్కలను పట్టుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్క పువ్వులు అనేక రంగులతో ప్రత్యేకతతో కూడిన ఆకర్షణ కలిగి ఉంటాయి. ఈ పూవులు చెట్టు పైన కనీసం ఏడు రోజుల పాటూ ఉంటాయి. ఈ పూవులు పెద్దవిగా ఉండి వాటి ఆకర్షణ పత్రాలు సన్నగా పొడవుగా అగ్ని కీలలు వలె వంకెలు తిరిగి ఉంటాయి. వాటి పుప్పొడి కీలాగ్రాలు 13 సెంటీమీటర్ల బారుగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు పువ్వు తొడిమ వద్ద ఆకు పచ్చ రంగులో ఉండి, క్రమంగా పసుపుపచ్చ, కాషాయ రంగు, కొసలు పూర్తి ఎరుపు రంగులో ఉంటాయి. దీని వేర్లు 15 నుండి 30 సెంటి మీటర్ల బారున కారెట్ దుంపల వలె ఉండి కొసలు సన్నగా మొనదేలి ఉంటాయి. ఈ మొక్క కాండము 3 నుండి 6 మీటర్లు బారున గట్టి తీగలుగా పెరుగుతుంది.
ఉపయోగపడే భాగాలు
వేరు భాగాలు.ఉపయోగాలు
ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది. భేది మందుగానూ, పురిటి నెప్పులను అధికం చేసేందుకు, లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టు, శరీరపు మంటలు, పైల్స్, పొత్తి కడుపు నొప్పి, దురదలను తగ్గిస్తుంది. శరీరానికి బలవర్థకము, వీర్యవృద్ధికి దివ్యౌషధము. మలాశయములోని జిగురును హరింపజేస్తుంది. నరాల నొప్పులకు, చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది. అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము.లక్షణాలు
ఇది 3.5 నుండి 6 మీటర్లు పొడవుదాకా బలహీనంగా ప్రాకే మొక్క.
- ఆకుల చివర్లలో మెలి తిరిగి ప్రాకడానికి అనువుగా ఆధారాన్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
- పుష్పాలు ఎరుపుతో కూడిన నారింజ రంగు మరియు పసుపుతో కూడిన తెలుగు రంగులో ఉంటాయి.
- కాయలు సుమారు 7-8 సెం.మీ. పొడవును కలిగి 40-50 విత్తనాలను కలిగివుంటాయి. విత్తనాలు ఎరుపుతో కూడిన నారింజ రంగులో ఉంటాయి.
ఉపయోగాలు
ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.- దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.
- దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.
No comments:
Post a Comment